వెంకటేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం – AK47’. ఈ సినిమా విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీ (అక్టోబర్ 2) కంటే వారం ఆలస్యంగా అక్టోబర్ 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. సినిమాను మరింత పర్ఫెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేసినట్లు మేకర్స్ తెలియజేశారు.
రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ సీన్స్‌తో వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.
